ఆటిజం పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగంపై అవగాహన

BHARAT TELUGU NEWS, Publish Date - Oct 08 , 2026 | 02:29 PM
విశాఖపట్నం: ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు మొబైల్ ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలపై విశాఖపట్నంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రిహాబిలిటేషన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
పిల్లలను ఆకట్టుకునేలా మ్యాజిక్ ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మైండ్ రీడర్, మెంటలిస్ట్ రవి, అనంతరం మెంటలిజం ద్వారా మొబైల్ ఫోన్ వినియోగం, స్క్రీన్ టైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
మ్యాజిక్, మెంటలిజం ప్రదర్శనలతో పిల్లలను ఎంటర్టైన్ చేస్తూనే.. మొబైల్ ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల పిల్లల మానసిక, ప్రవర్తనా వికాసంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చనే విషయాలను లైవ్ ప్రదర్శనల ద్వారా వివరించారు.
ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్లో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నియంత్రించడం, తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ టైమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
మెంటలిజం ప్రదర్శనల ద్వారా విషయాలను ప్రత్యక్షంగా చూపించడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షించారు. సాధారణ ఉపన్యాసాలకు భిన్నంగా మ్యాజిక్, మెంటలిజాన్ని ఉపయోగించి అవగాహన కల్పించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు.. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వారి అభిరుచులు, ప్రవర్తనలో మార్పులను గమనించాలని నిర్వాహకులు సూచించారు
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
మొదటి వ్యాఖ్య మీరే రాయండి!
