తమిళనాడులో సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తన సత్తా చాటుతోంది. రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల స్థానాల్లోనూ ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.
పట్నా నుంచి లఖ్నవూ వెళ్తున్న ఇండిగో విమానంపై 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు పడింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం.
అక్టోబర్ 15 నుంచి ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులపై కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. యూపీఐ లావాదేవీలపై ప్రభావం ఉండదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ ‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో భాగంగా పది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసింది.
2026 వైద్య శాస్త్ర నోబెల్ బహుమతిని కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆప్టోజెనెటిక్స్ పరిశోధనలకు ఈ పురస్కారం లభించింది.
భారత్ భద్రత, సమగ్రతకు రష్యా అందించిన మద్దతును విదేశాంగ మంత్రి జైశంకర్ గుర్తుచేశారు. రష్యాతో చారిత్రక సంబంధాలు, చమురు కొనుగోలు, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.