🇮🇳

BharatTelugu News

▶f𝕏📷
భారత్ & విదేశాలు

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్

🕒 6 అక్టోబర్, 2026👁 2.6k📖 1 నిమిషాల చదవడం
షేర్ చేయండి:🟢𝕏f
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్

BHARATH TELUGU NEWS , Publish Date - Oct 06 , 2026 | 05:01 PM

అమరావతి, అక్టోబర్ 6: పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరుతో కౌంటర్ ఇంటిలిజెన్స్‌కు చెందిన 12 బృందాలు నిర్వహించిన దాడుల్లో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.

అధికారుల వివరాల ప్రకారం.. డబ్బు కోసం పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలపై నేవీ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విశాఖ నేవల్ బేస్‌లో పనిచేస్తున్న ప్రదీప్ ముఖర్జీని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.

కోయంబత్తూరులో ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసేందుకు వాట్సాప్‌ను యాక్టివేట్ చేయడానికి ఓటీపీ షేర్ చేయడంతో పాటు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రదీప్ ముఖర్జీకి ఈ నెల 14 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ఈ దర్యాప్తులో భాగంగా మొత్తం 13 మంది నేవీ సిబ్బందితో సహా 18 మంది అనుమానితులను కౌంటర్ ఇంటిలిజెన్స్ బృందాలు విచారించినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వ్యక్తుల వద్ద నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో కౌంటర్ ఇంటిలిజెన్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

షేర్ చేయండి:🟢𝕏f

సంబంధిత వార్తలు

వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మీరే రాయండి!