తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ పార్టీ హవా.. రెండు స్థానాల్లోనూ భారీ ఆధిక్యం!

BHARATH TELUGU NEWS Publish Date - Oct 09 , 2026
అక్టోబర్ 9: తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఉప ఎన్నికల్లో దూసుకుపోతోంది. రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. తొలుత ఇరు స్థానాల్లోనూ పోటీ హోరాహోరీగా సాగినప్పటికీ, తాజా రౌండ్లలో టీవీకే అభ్యర్థులు ముందంజలోకి వచ్చారు. ముఖ్యంగా మదురాంతకం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి కె. మరగతం కుమారవేల్ తన ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు.
ధారాపురం నియోజకవర్గంలో మొదట్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి బాణుమతి ఆధిక్యంలో కొనసాగగా, తదుపరి రౌండ్లలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామ పుంజుకుని ముందంజ సాధించారు. మరోవైపు, మదురాంతకం స్థానంలో టీవీకే అభ్యర్థి కె. మరగతం కుమారవేల్ సుమారు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయానికి చేరువయ్యారు. రెండు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కనబరచడంతో టీవీకే శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని పార్టీ జెండాలు, విజయ్ చిత్రాలతో నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు
సంబంధిత వార్తలు
భారత్ & విదేశాలుగగనతలంలో విమానంపై పిడుగుపాటు.. అత్యవసర ల్యాండింగ్
భారత్ & విదేశాలుఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..యూపీఐ ఛార్జీలతో లావాదేవీలు తగ్గవు
భారత్ & విదేశాలుపాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్
భారత్ & విదేశాలువైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ఆప్టోజెనెటిక్స్పై పరిశోధనలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
వ్యాఖ్యలు
మొదటి వ్యాఖ్య మీరే రాయండి!