🇮🇳

BharatTelugu News

▶f𝕏📷
ఈవెంట్స్ & ఫంక్షన్స్

నెల్లిమర్లలో యూత్ ఫెస్టివల్ 2026 యువతను ఒక్కతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం!

🕒 27 రోజుల క్రితం👁 2.5k📖 1 నిమిషాల చదవడం
షేర్ చేయండి:🟢𝕏f
 నెల్లిమర్లలో యూత్ ఫెస్టివల్ 2026  యువతను ఒక్కతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం!

BHARAT TELUGU NEWS, Publish Date - Oct 08 , 2026 | 07:00 PM

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ యువతలోని ప్రతిభను వెలికితీయడంతో పాటు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో యూత్ ఫెస్టివల్ 2026 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

యువతలో ఐక్యత, సృజనాత్మకత, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అక్టోబర్ 9, 10, 11 తేదీల్లో వివిధ సాంస్కృతిక, వినోదాత్మక పోటీలు నిర్వహిస్తున్నారు.

మూడు విభాగాల్లో పోటీలు

యూత్ ఫెస్టివల్‌లో ప్రధానంగా కోలాటం, డ్యాన్స్, సింగింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. యువత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలవనుంది.

పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు. మూడు విభాగాల్లోనూ మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి రూ.10,000, మూడో బహుమతి రూ.5,000 చొప్పున అందించనున్నారు.



ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం నాగమాధవి

యూత్ ఫెస్టివల్ చివరి రోజైన ఆదివారం ప్రత్యేక ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ MLA శ్రీమతి "లోకం నాగమాధవి" ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

యువత అందరూ పాల్గొనాలి.. నిర్వాహకుల పిలుపు

యువతను అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, వారి మధ్య ఐక్యతను పెంపొందించడం, స్థానికంగా ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

నెల్లిమర్ల ప్రాంతంలోని యువత అందరూ ఈ యూత్ ఫెస్టివల్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొని, తమలోని టాలెంట్‌ను ప్రదర్శించి తమ ప్రతిభను నిరూపించుకోవాలని నిర్వాహకులు కోరారు. యువతలో ఐక్యత, స్నేహభావాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

యూత్ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో యువతకు, గ్రామ ప్రజలకు, స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని విధాలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని Prudhvi Sunkari, Manyala Durga Prasad & Team నిర్వహిస్తున్నారు.

“యువతే శక్తి.. యువతే భవిష్యత్తు” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ యూత్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు యువత, ప్రజలు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

షేర్ చేయండి:🟢𝕏f

వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మీరే రాయండి!