తల్లికి వందనం పథకంపై కీలక అప్‌డేట్.. లబ్ధిదారులకు అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పథకంపై కీలక అప్‌డేట్ వెలువడింది. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న ఈ పథకం రెండో విడత లబ్ధిదారులను ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడత నిధులు విడుదల చేసినప్పటికీ, సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల కొంతమంది అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. దీంతో ప్రభుత్వం వారి నుంచి వివరాలు, ఫిర్యాదులను స్వీకరించింది. అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, అర్హతలను నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు రెండో విడతలో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి అందిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించిన అధికారులు రెండో విడతకు సంబంధించి 3,29,201 మందిని అర్హులుగా గుర్తించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ విడతకు సంబంధించిన నిధులు, లబ్ధిదారుల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు.

సంబంధిత వార్తలు
ఆంధ్ర & తెలంగాణWeather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం!
ఆంధ్ర & తెలంగాణపోలవరం పునరావాస పనులు వేగవంతం.. నిధులపై చంద్రబాబు కీలక విజ్ఞప్తి
ఆంధ్ర & తెలంగాణజలుబు.. దగ్గు.. జ్వరం మొదలవుతున్నాయి
ఆంధ్ర & తెలంగాణఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రభావం.. 100 కోట్ల ఉచిత ప్రయాణాలు
వ్యాఖ్యలు
మొదటి వ్యాఖ్య మీరే రాయండి!