🇮🇳

BharatTelugu News

▶f𝕏📷
ఆంధ్ర & తెలంగాణ

దుర్గమ్మ లడ్డూ ప్రసాదానికి ‘ఏటీఎం’ సదుపాయం

🕒 1 అక్టోబర్, 2026👁 5.1k📖 1 నిమిషాల చదవడం
షేర్ చేయండి:🟢𝕏f
దుర్గమ్మ లడ్డూ ప్రసాదానికి ‘ఏటీఎం’ సదుపాయం

NEWS Vijayawada
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు అధికారులు ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
దసరా నవరాత్రుల సందర్భంగా బుధవారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
ఇకపై భక్తులు ఏటీఎం తరహాలో ఆప్షన్లను ఎంపిక చేసుకుని "లడ్డూ" ప్రసాదాన్ని పొందవచ్చు.
రూ.100, రూ.200, రూ.300, రూ.400 విలువైన బాక్సుల రూపంలో ప్రసాదాన్ని అందించనున్నారు.
ఒక్కో బాక్సులో 6 లడ్డూలు ఉంటాయి. ఒక్కో బాక్సు ధరను రూ.100గా నిర్ణయించారు. దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ మరింత సులభతరం చేయడమే ఈ సదుపాయం ఉద్దేశం.

2026లో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించనున్నారు.

నవరాత్రులు: అక్టోబర్ 11 – 19, 2026
విజయదశమి (దసరా): అక్టోబర్ 20, 2026

షేర్ చేయండి:🟢𝕏f

సంబంధిత వార్తలు

వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మీరే రాయండి!